![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -88 లో......జ్యోతి ఫోన్ చేస్తుంది. బయటకు వెళ్లి మాట్లాడుకోండి అని మాధవని మహా బయటకు పంపిస్తుంది. మాధవ ఇంట్లో గురించి మాట్లాడుతాడు. మీ గురించి చెప్పండి అని జ్యోతి అడుగుతుంది. కేశవ వాళ్ళు అందరు వచ్చి మాధవ ఏం మాట్లాడుతున్నాడో వినాలని అనుకుంటున్నారు. వాడి మాటలు వింటే మీకు చిరాకు వేస్తుందని నారాయణ అంటాడు. అప్పుడే మహా వచ్చి అందరిని లోపలికి వెళ్ళమని చెప్తుంది. మరుసటి రోజు మాధవ ఫ్రెండ్ డల్ గా ఉంటాడు. ఏంటని మాధవ అడుగుతాడు. నా చెల్లికి ఒక సంబంధం వచ్చింది చేసుకోను అంటుందని అతను చెప్పగానే నీ చెల్లికి నచ్చిన సంబంధంచెయ్ అని మాధవ సలహా ఇస్తాడు.
ఆ తర్వాత మాధవకి జ్యోతి ఫోన్ చేస్తుంది. మాధవ ఇబ్బందిగా మాట్లాడుతాడు. ఏదైనా అడిగితే సమాధానం చెప్తాడు అంతే.. నాకు పని ఉందని మాధవ ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి జ్యోతి ఫోన్ చేసి మీరు ఎవరినైనా లవ్ చేసారా అని అడుగుతుంది. మళ్ళీ తర్వాత చేస్తానంటూ కట్ చేస్తాడు. మరొకవైపు మహా వాళ్ళు భోజనం చేస్తుంటారు. అప్పుడే నారాయణ మహా కోసం అని చికెన్ 65 తీసుకొని వస్తాడు. ఇది మా అమ్మ కోసం అని నారాయణ అనగానే మహాలక్ష్మి మీకు అమ్మ ఎప్పుడు అయిందోనని చక్రి అంటాడు. తను మిమ్మల్ని బెదిరించినప్పుడు మీ అమ్మ అనుకున్నప్పుడు నన్ను బెదిరించినప్పుడు నేను మా అమ్మ అనుకోలేనా అని నారాయణ అనగానే మహా నవ్వుతుంది. అందరు కలిసి తింటారు. అప్పుడే మహాకి జ్యోతి ఫోన్ చేసి మాధవ గారికి నేనంటే ఇష్టం లేదని అర్థం అయింది తన మనసులో ఇంకెవరో ఉన్నారు నన్ను క్షమించండి. తెలిసి తెలిసి రిస్క్ చెయ్యలేనని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత మాధవ వస్తాడు. జ్యోతి ఫోన్ చేసిందా అని అడుగుతారు. చేసిందని మాధవ అంటాడు. సంబంధం క్యాన్సిల్ అయిందని మాదవకి అర్ధం అవుతుంది. పెద్ది ఇంకా గాయత్రిని మర్చిపోలేదు.. కొంచెం టైం ఇద్దామని చక్రి వాళ్ళతో మహా చెప్తుంది. ఆ తర్వాత గాయత్రికి మహా గుళ్లో కన్పిస్తుంది. దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. అప్పుడే తాయారు వచ్చి మహాతో గొడవ పెట్టుకుంటుంది.
ఆ తర్వాత రాత్రి మహా ఉల్లిపాయలు కట్ చేస్తూ ఏడుస్తుంది. అయ్యో వదిన ఏడుస్తుందని కన్నా అంటాడు. ఉల్లిపాయలు కట్ చేస్తే ఇలాగే వస్తాయని మహా అంటుంది. అప్పుడే గాయత్రి వస్తుంది. కేశవ, కన్నా, చక్రి, నారాయణ ఇలా అందరు మాటల్తో గాయత్రికి చుక్కలు చూపెడతారు. దాంతో గాయత్రి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చక్రితో మహా బయట మాట్లాడుతుంది. తరువాయి భాగంలో అందరు కలిసి గాయత్రి, మాధవకి పెళ్లి చెయ్యడానికి గుళ్లో అన్ని ఏర్పాట్లు చేస్తారు. గాయత్రి ఇంట్లో నుండి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
.
![]() |
![]() |